ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం జరిగింది. ఘాజియాబాద్‌లోని.. లోనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో పర్వీన్(40) అనే మహిళతో పాటు ఆమె కుమారులు అబ్దుల్ అహాద్, అబ్దుల్ అజీమ్..కూతుళ్లు రతియా, ఫాత్మా, సాహిమా మృత్యువాతపడ్డారు. పిల్లలంతా కూడా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారే. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి
.