యూపీలో ఘోర ప్రమాదం..

యూపీలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హర్డోయిలో పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర […]

యూపీలో ఘోర ప్రమాదం..

Edited By:

Updated on: Jun 06, 2019 | 4:48 PM

యూపీలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హర్డోయిలో పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.