Selfie Suicide : లోన్‌యాప్‌ వేధింపులకు మరో నిండుప్రాణం బలి..కలకలం సృష్టిస్తున్న సూసైడ్ సెల్ఫీ

ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్న లోన్‌యాప్‌ వేధింపులకు మరో నిండుప్రాణం బలైంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో విశాఖలో.. సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సంతోష్ కుమార్..

Selfie Suicide : లోన్‌యాప్‌ వేధింపులకు మరో నిండుప్రాణం బలి..కలకలం సృష్టిస్తున్న సూసైడ్ సెల్ఫీ

Updated on: Dec 26, 2020 | 5:38 PM

Selfie Suicide : ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్న లోన్‌యాప్‌ వేధింపులకు మరో నిండుప్రాణం బలైంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో విశాఖలో.. సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సంతోష్ కుమార్ సెల్ఫీలో తన ఆవేదన చెప్పుకున్నాడు. తన చావుతోనైనా కొంతమంది మారతారని సెల్ఫీ వీడియోలో సంతోష్‌ ఆవేదన చెందాడు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సైట్ ఇంచార్జ్‌గా సంతోష్‌ పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ లోన్ యాప్‌లలో 54 వేల అప్పుకు వడ్డీలమీద వడ్డీలేస్తూ వేధించారు యాప్ నిర్వాహకులు. వాయిదాలు చెల్లిస్తున్నా… లోన్‌ యాప్ ఎగ్జిక్యూటివ్‌లు వేధించటంతో.. పురుగుల మందు తాగుతూ బాధితుడు సూసైడ్ సెల్ఫీ తీసుకున్నాడు. కరీంనగర్ నుంచి విశాఖ తరలించగా…కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సంతోష్‌ ప్రాణాలు కోల్పోయాడు. సంతోష్ స్వస్థలం విజయనగరం జిల్లా భోగాపురం.

లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఈమధ్యే విశాఖలో ఆహ్లాద అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మరో యువతి టార్చర్‌ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటికే 30యాప్‌లను గుర్తించిన పోలీసులు.. బెదిరింపులకు దిగుతున్న నిందితులను ట్రాక్‌ చేసే పనిలో ఉన్నారు.