కారును మింగేసిన భారీ సింక్‌హోల్.. వాహనంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు

|

Nov 28, 2020 | 4:57 PM

నడిరోడ్డులో ఉన్నట్టుండీ.. ఒక్కసారిగా కుంగిపోయింది. పెద్ద గొయ్యిలో అక్కడే ఉన్న కారు కాస్త అమాంతం అందులో కురుక్కుపోయింది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కారును మింగేసిన భారీ సింక్‌హోల్.. వాహనంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు
Follow us on

నడిరోడ్డులో ఉన్నట్టుండీ.. ఒక్కసారిగా కుంగిపోయింది. పెద్ద గొయ్యిలో అక్కడే ఉన్న కారు కాస్త అమాంతం అందులో కురుక్కుపోయింది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన అన్నింటిలో అగ్రస్థానం అని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికాలో జరిగింది. రోడ్డుపై ఏర్పడిన ఓ భారీ సింక్‌హోల్ పెద్ద ఎస్‌యూవీ వాహనాన్ని మింగేసింది. ఈ ఘ‌ట‌న థ్యాంక్స్‌గివింగ్ డేనాడు న్యూయార్క్‌లో జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆ వెహికిల్‌లో ఎవ‌రూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంత‌టి ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డినందుకు ఆ ఓన‌ర్ తుప్టెన్ టోప్జీ ఊపిరి పీల్చుకున్నాడు. నేను చాలా అదృష్ట‌వంతున్ని అంటూ ఆ వ్య‌క్తి సంతోషం వ్యక్తం చేశాడు. సింక్‌హోల్‌లోకి ఎస్‌యూవీ ప‌డిపోతున్న ఫొటోలు ట్విట‌ర్‌లో వైర‌ల్‌గా మారాయి. అయితే అంత భారీ సింక్‌హోల్ ఏర్ప‌డ‌టానికి కార‌ణం ఏంట‌న్న‌దన్న దానిపై స్థానికులు అధికారులు విచారణ చేపట్టారు. న్యూయార్క్ సిటీలో ఇలాంటి సింక్‌హోల్‌లు ఏర్ప‌డ‌టం ఇదే తొలిసారి కాదు. 2015లో బ్రూక్లిన్‌లో ఏర్ప‌డిన సింక్‌హోల్‌లోకి చాలా వ‌ర‌కు రోడ్డు కుంగిపోయింది.