ఇక ప్లాస్టిక్ భూతానికి నూకలు చెల్లు.!

| Edited By:

Sep 21, 2019 | 2:12 PM

జీవరాశులకు, పర్యావరణానికి ప్లాస్టిక్ చేస్తోన్న హానిపై ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. దీంతో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకొన్న ఆయా దేశాలు.. ఆ దిశగా అడుగులు కూడా వేసి ఇప్పటికే కాస్త విజయాన్ని సాధించాయి. ఈ నేపధ్యంలో భారత్‌లోనూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఆయన దేశ ప్రజలను కోరారు. ఈ క్రమంలో కేంద్ర రవాణా శాఖ […]

ఇక ప్లాస్టిక్ భూతానికి నూకలు చెల్లు.!
Follow us on

జీవరాశులకు, పర్యావరణానికి ప్లాస్టిక్ చేస్తోన్న హానిపై ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. దీంతో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకొన్న ఆయా దేశాలు.. ఆ దిశగా అడుగులు కూడా వేసి ఇప్పటికే కాస్త విజయాన్ని సాధించాయి. ఈ నేపధ్యంలో భారత్‌లోనూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఆయన దేశ ప్రజలను కోరారు. ఈ క్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం బస్ స్టేషన్‌లో ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేయించాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఇక ఇండియన్ రైల్వేస్‌లోనూ అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్‌ను బ్యాన్‌ చేయబోతున్నట్లు రైల్వే అధికారులు ఇదివరకే ప్రకటించారు. మొత్తానికి అక్టోబర్ 2 నుంచి భారత్‌లో మరో విశిష్ట పథకం ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా పలు ప్లాస్టిక్ వస్తువులు మనకు కనిపించకపోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

నిషేధం కానున్న వస్తువులివే..
జెండాలు
బెలూన్లు
ఇయర్ బడ్స్
క్యాండీలకు ఉపయోగించే పుల్లలు
స్ట్రాలు
50 మైకాన్ల కన్నా తక్కువ మందం ఉన్న సంచులు
ప్లాస్టిక్ షీట్లు అతికించి చేసిన ప్లేట్లు, గిన్నెలు, చిన్న కప్పులు
ఫోమ్డ్ ప్లేట్లు
కప్పులు
అల్లికలేని బ్యాగులు
చిన్న ప్లాస్టిక్ సీసాలు
ప్యాకింగ్‌కు ఉపయోగించే చిన్న తరహా షీట్లు
థర్మాకోల్ వస్తువులు.
ఇవన్నీ అక్టోబర్ 2 నుంచి కనిపించకపోవచ్చు. వాటిలో కొన్నింటి స్థానంలో మట్టితో తయారుచేసిన వస్తువులు వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఇదివరకే భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్‌కు నో చెప్పేశాయి. అయితే ఇందులో కొన్ని మాత్రమే పాక్షికంగా అమలు చేస్తున్నాయి. మొట్టమొదటగా కేరళ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసింది. 2019 ఏప్రిల్ 10 నుంచి కేరళలో ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించగా.. అది విజయవంతంగా అమలవుతోంది.