అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ పర్యవసానం, కొత్త వైరస్ వేరియంట్ లేదని స్పష్టం చేయండి, ట్విటర్, ఫేస్ బుక్ లకు సింగపూర్ ప్రభుత్వ ఆదేశం
సింగపూర్ లో కొత్త వైరస్ వేరియంట్ గురించి తప్పుడు స్టేట్ మెంట్ వచ్చిందని, దీన్ని సరిదిద్దుకోవాలని దేశంలోని యూజర్లకు కరెక్షన్ నోటీసులివ్వాలని ట్విటర్, ఫేస్ బుక్ లను సింగపూర్ ప్రభుత్వం ఆదేశించింది.

సింగపూర్ లో కొత్త వైరస్ వేరియంట్ గురించి తప్పుడు స్టేట్ మెంట్ వచ్చిందని, దీన్ని సరిదిద్దుకోవాలని దేశంలోని యూజర్లకు కరెక్షన్ నోటీసులివ్వాలని ట్విటర్, ఫేస్ బుక్ లను సింగపూర్ ప్రభుత్వం ఆదేశించింది. మీడియా ఔట్ లెట్ల ద్వారా ఆన్ లైన్ లోను , సోషల్ మీడియా వేదికల్లోనూ సర్క్యులేట్ అవుతున్న ఈ స్టేట్ మెంట్ గురించి తమకు తెలుసునని, ఇది ఈ దేశం నుంచి ఇండియాకు వ్యాప్తి చెందిందని ప్రభుత్వం పేర్కొంది. సింగపూర్ వేరియంట్ ప్రమాదకరమైనదని, ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా హాని కలుగజేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న ట్వీట్ చేశారు. దీంతో సింగపూర్ లో పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇది తప్పుడు సమాచారమని, తమ దేశానికి సంబంధించిన ఈ వేరియంట్ విషయంలో వచ్చిన వార్తలు అసత్యమని సింగపూర్ ప్రభుత్వం ఖండించింది.ఈ నేపథ్యంలోనే అక్కడి సర్కార్ ఇలా ట్విటర్, ఫేస్ బుక్ లకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ చేసిన ట్వీట్ వాస్తవాలపై ఆధారపడినది కాదని, బాధ్యతారాహిత్యమని భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో సింగపూర్ మెత్తబడింది. నిజానికి కోవిద్ అదుపులో భారత సింగపూర్ ప్రభుత్వాలు కలిసి కట్టుగా కృషి చేస్తున్నాయని ఇండియాలోని సింగపూర్ హైకమిషనర్ పేర్కొన్నారు.
సింగపూర్ ఫేక్ న్యూస్ లా లేదా ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆన్ లైన్ ఫాల్స్ హుడ్ అండ్ మ్యానిప్యులేషన్ యాక్ట్ కింద సింగపూర్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )
Priyadarshi Pulikonda: మరో విభిన్న కథతో రానున్న ప్రియదర్శి.. ఆకట్టుకుంటున్న పోస్టర్