Silver Cost Today(10-01-2021): అంతర్జాతీయంగా వెండి ధరలో తగ్గుదల దేశీయ మార్కెట్ లో భారీగా తగ్గిన సిల్వర్ ధరలు..

|

Jan 10, 2021 | 10:49 AM

అంతర్జాతీయంగా డాలర్ ధర బలపడంతో.. వెండి ధరలు ఏకంగా భారీస్థాయిలో దిగివచ్చాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న...

Silver Cost Today(10-01-2021): అంతర్జాతీయంగా వెండి ధరలో తగ్గుదల దేశీయ మార్కెట్ లో భారీగా తగ్గిన సిల్వర్ ధరలు..
Follow us on

Silver Cost Today(10-01-2021): అంతర్జాతీయంగా డాలర్ ధర బలపడంతో.. వెండి ధరలు ఏకంగా భారీస్థాయిలో దిగివచ్చాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న బంగారం తో పాటు ఇతర విలువైన మెటల్స్ సిల్వర్, పెల్లాడియం ధరలు కూడా తగ్గుతున్నఐహి. తాజాగా సిల్వర్ కూడా రూ.6,112 మేర తగ్గి కేజీ రూ.63,850గా నమోదయ్యింది. దీంతో గత ఏడాది మొదట్లో వెండి ధరతో పోలిస్తే ఏకంగా 9.8 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది.

కరోనాతో పెట్టుబడిదారులందరూ సిల్వర్ వైపు చూశారు. దీంతో వెండి కేజీ రూ.80 వేలకు చేరువలోకి వెళ్లింది. తాజాగా డాలర్ బలపడడం.. కోవిడ్ కు వ్యాక్సిన్ రావడంతో ఆదివారం నాటికి వెండి ధర రికార్డు స్థాయిలో తగ్గుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె ఏకంగా 6,000 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 63 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 63,900 రూపాయలుగా నమోదు అయింది. అయితే బంగారం వెండి వైపు చూసే ముదుపరులు అంతర్జాతీయంగా వీటి ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా ఉన్న డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును.

Also Read: పసిడి ప్రియులకు శుభవార్త .. డాలర్ బలపడటంతో దిగివస్తున్న బంగారం ధర