‘భీష్మ’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత నితిన్ బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాధున్’ రీమేక్‌లో నటించబోతున్నాడు.
Also Read: కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!
ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ని తీసుకున్నారని టాక్. ఇక మాతృకలో టబు పోషించిన పాత్ర కోసం మొదట స్టార్ హీరోయిన్ నయనతారను సంప్రదించారట చిత్ర యూనిట్. అయితే ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో.. మరో స్టార్ హీరోయిన్ శ్రియతో సంప్రదింపులు జరిపారట. శ్రియకు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.