
అల్లు అర్జున్‌తో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ స్టెప్పులేయనుందనే ప్రచారం బీటౌన్‌లో జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రత్యేక గీతం ఉండగా..ఈ పాట కోసం సుకుమార్ అండ్ టీం బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ బన్నీతో కలిసి శ్రద్దాకపూర్ డ్యాన్స్ చేయనుందనే విషయం కామన్ గుస గుస అంటోంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన మరో న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
శ్రద్దాకపూర్, బన్నీతో కలిసి స్టెప్పులేసేందుకు రెడీ అవుతుండటం నిజమే..కానీ పుష్ప సినిమాలో మాత్రం కాదట. కొరటాల-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే సినిమా ఓకే అయింది. కొరటాల శివ చిత్రంలో శ్రద్దాకపూర్ స్పెషల్ సాంగ్ కానున్నట్టు సమాచారం. అంతా పుష్ప సినిమాలో మరో హీరోయిన్ అంటూ జోరుగా ప్రాచం సాగింది. ఈ క్లారిఫికేషన్‌తో అంతా కూల్ అయ్యారు.