రోహిత్‌కు, కోహ్లీకి మధ్య ఉన్న వ్యత్యాసం అదే…

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై టీమిండియా ఓపెనర్, గబ్బర్ శిఖర్ ధావన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. ఇద్దరూ చాలా ప్రత్యేకమైన ఆటగాళ్ళని..

  • Ravi Kiran
  • Publish Date - 11:13 pm, Fri, 19 June 20
రోహిత్‌కు, కోహ్లీకి మధ్య ఉన్న వ్యత్యాసం అదే...

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై టీమిండియా ఓపెనర్, గబ్బర్ శిఖర్ ధావన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. ఇద్దరూ చాలా ప్రత్యేకమైన ఆటగాళ్ళని.. వీరి జోడి భారత్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిందని ధావన్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

”టీమిండియాలో ప్రతీ ఆటగాడికి ఒక స్టైల్ ఉంటుంది. ఎవరి ప్రత్యేకతలు వారివి. ఆ కలయికల కారణంగానే విజయాలు వరిస్తున్నాయని ధావన్ అన్నాడు. ఇక రోహిత్, కోహ్లీ బ్యాటింగ్‌పై స్పందించిన అతడు.. హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ మొదట క్రీజ్‌లో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకుంటాడని.. ఒక్కసారి కుదురుకున్నాక అతన్ని ఆపడం ఎవరితరం కాదని తెలిపాడు. అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పూర్తిగా క్లాస్, నిలకడతత్వంతో ఉంటుందన్నాడు. ఛేజింగ్‌ మ్యాచ్‌లలో ఒక్కసారిగా ఈ ఇద్దరూ క్రీజ్‌లో కుదురుకుంటే ఏ బౌలర్ కూడా వీరిని ఆపలేడని గబ్బర్ పేర్కొన్నాడు. అలాగే ఇలాంటి గొప్ప ఆటగాళ్లు ఉన్న భారత జట్టులో తాను కూడా ఓ భాగం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ధావన్ చెప్పుకొచ్చాడు.