పాంటింగ్ కంటే ధోని ది బెస్ట్…

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌తో పాటుగా బెస్ట్ కెప్టెన్ అఫ్ అల్ టైం అని చెప్పవచ్చు. అయితే ధోని కంటే ముందుగా ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్ ఉంటాడన్నది అక్షర సత్యం.

పాంటింగ్ కంటే ధోని ది బెస్ట్...
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 31, 2020 | 9:59 PM

Shahid Afridi Picks His Favourite Captain: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌తో పాటుగా బెస్ట్ కెప్టెన్ అఫ్ అల్ టైం అని చెప్పవచ్చు. అయితే ధోని కంటే ముందుగా ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్ ఉంటాడన్నది అక్షర సత్యం. 90వ దశకం నుంచి దాదాపు 2011 వరకు ఆసీస్ జట్టుకు ఘన విజయాలు అందించడమే కాకుండా అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాను ఎదురులేని జట్టుగా తీర్చిదిద్దాడు. పాంటింగ్ మాదిరిగానే ధోని కూడా భారత్‌కు అపురూపమైన విజయాలతో పాటుగా నెంబర్ వన్ ర్యాంక్‌కు చేర్చాడు. వీరిద్దరిలో ఎవరు గొప్ప కెప్టెన్ అని సగటు క్రీడా అభిమానిని అడిగినా.. ఠక్కున ఆన్సర్ చెప్పలేరు. కొంతమంది ధోనికి ఓటు వేస్తే.. మరికొందరు పాంటింగ్‌ను ఎంచుకుంటారు.

ఇక తాజాగా క్రిక్ ట్రాకర్ ధోని, పాంటింగ్‌లలో బెస్ట్ కెప్టెన్ ఎవరని పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీని అడగ్గా.. అతడు తడుముకోకుండా ధోనినే ఎంచుకున్నాడు. ”నేను పాంటింగ్ కంటే ధోనికే ఎక్కువ రేటింగ్ ఇస్తాను. ధోని మొత్తం యువకులతో కూడిన జట్టును బలోపేతంగా మార్చాడు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక అభిమానులు కూడా ధోనినే బెస్ట్ కెప్టెన్ అంటూ కామెంట్స్ పెట్టారు.