AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా ఆర్మీతో లింకులున్న 7 కంపెనీలపై భారత్ లో వేటు ?

చైనా సైన్యంతో లింకులున్న ఏడు ప్రముఖ కంపెనీలు ఇండియాలో తీవ్రమైన చర్యను ఎదుర్కోవలసి రావచ్ఛు.. అంటే ఇటీవల చైనాకు చెందిన 58 యాప్ లపై  భారత ప్రభుత్వం నిషేధం వేటు వేసినట్టే వీటి విషయంలో కూడా తీవ్రమైన నిర్ణయం తీసుకునే..

చైనా ఆర్మీతో లింకులున్న 7 కంపెనీలపై భారత్ లో వేటు ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 18, 2020 | 7:32 PM

Share

చైనా సైన్యంతో లింకులున్న ఏడు ప్రముఖ కంపెనీలు ఇండియాలో తీవ్రమైన చర్యను ఎదుర్కోవలసి రావచ్ఛు.. అంటే ఇటీవల చైనాకు చెందిన 58 యాప్ లపై  భారత ప్రభుత్వం నిషేధం వేటు వేసినట్టే వీటి విషయంలో కూడా తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చైనా లోని హువే, అలీబాబా, జిండియా స్టీల్స్, జిన్ జింగ్ కేఫీ ఇంటర్నేషనల్, చైనా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ గ్రూప్, టెంసెంట్, సైక్ మోటార్ కార్పొరేషన్ అనే ఈ సంస్థలకు చైనా సైన్యంతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. వీటిపై గట్టి నిఘా పెట్టినట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో భారత్ లోని తన ఆపరేటర్ల ద్వారా హువే సంస్థకు రూ. 12,800 కోట్ల రెవెన్యూ వచ్చినట్టు సమాచారం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇంజనీరింగ్ కార్ప్స్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన రెన్ జెంగ్ ఫీ.. 5 జీకి సంబంధించి పలు దేశాల నుంచి సమస్యలను ఎదుర్కొంటున్నాడు.

అలీబాబా సంస్థ.. ఇండియాలో పే టీఎం, జొమాటో, బిగ్ బాస్కెట్, స్నాప్ డీల్ వంటి పలు స్టార్టప్ లలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇక టెంసెంట్ సంస్థ.. ఓలా క్యాబ్స్ లో 400 మిలియన్ డాలర్లను ,ఫ్లిప్ కార్ట్ లో 700 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఇతర సంస్థలు కూడా పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.

Follow Us
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌