సీరం కంపెనీ నుంచి మరో వ్యాక్సిన్, ‘కోవోవాక్స్’ , జూన్ నుంచి అందుబాటులోకి, ఆదార్ పూనావాలా

కరోనా వైరస్ పై పోరుకు తమ సంస్థ నుంచి మరో వ్యాక్సిన్ రానుందని పుణెలోని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా ప్రకటించారు.  కోవోవాక్స్ పేరిట ఈ ఏడాది జూన్ నాటికి ఈ కొత్త వ్యాక్సిన్..

  • Updated On - 3:14 pm, Sat, 30 January 21 Edited By: Ravi Kiran
సీరం కంపెనీ నుంచి మరో వ్యాక్సిన్, 'కోవోవాక్స్' , జూన్ నుంచి అందుబాటులోకి, ఆదార్ పూనావాలా

కరోనా వైరస్ పై పోరుకు తమ సంస్థ నుంచి మరో వ్యాక్సిన్ రానుందని పుణెలోని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా ప్రకటించారు.  కోవోవాక్స్ పేరిట ఈ ఏడాది జూన్ నాటికి ఈ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. దీని నాణ్యత, సేఫ్టీ కూడా ఎక్కువేనని, త్వరలో ట్రయల్స్ కోసం ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. నోవోవాక్స్ కంపెనీతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. ఇప్పటికే దేశంలో సీరం కంపెనీ నుంచి కోవిషీల్డ్, భారత్ బయో టెక్ సంస్థ నుంచి కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ప్రజలకు ‘సేవలందిస్తున్నాయి’. ఈ నెల 16 నుంచి ఇండియా వీటి వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున ప్రారంభించింది. సుమారు 15 లక్షలమందికి పైగా హెల్త్ కేర్ వర్కర్లు, కొందరు డాక్టర్లు ఈ టీకామందులను తీసుకున్నారు.