
కరోనా నియంత్రణకు దేశీయంగా భారత్ బయోటెక్ సంస్థ, సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ నాలుగు రోజుల వ్యవధిలో భారత్ బయోటెక్, ఫైజర్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు (డీసీజీఐ) దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలోని కొవిడ్-19 నిపుణుల కమిటీ ఈ మూడు విజ్ఞప్తులను పరిశీలించింది. కాగా, కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాను అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపలేదు. ఫైజర్ టీకాకు అనుమతి లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.