AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అమ్మ’గా రమ్య అదరగొట్టింది, కంగనా అగ్ని పరీక్షను ఎదుర్కొనబోతుంది..తేడా వస్తే తమిళ తంబీల గురించి తెలుసుగా?

ఆమె తమిళులకు 'అమ్మ'..తెరపై ఆమెను చూపించే విధానంలో తేడా వస్తే తంబీలు తోలు తీసేస్తారు. ఇప్పటికే ఎవర్‌‌గ్రీన్ రమ్యకృష్ణ..తమిళనాడు మాజీ సీఎం జయలలిత పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.

'అమ్మ'గా రమ్య అదరగొట్టింది, కంగనా అగ్ని పరీక్షను ఎదుర్కొనబోతుంది..తేడా వస్తే తమిళ తంబీల గురించి తెలుసుగా?
Ram Naramaneni
|

Updated on: Dec 09, 2020 | 5:57 PM

Share

ఆమె తమిళులకు ‘అమ్మ’..తెరపై ఆమెను చూపించే విధానంలో తేడా వస్తే తంబీలు తోలు తీసేస్తారు. ఇప్పటికే ఎవర్‌‌గ్రీన్ రమ్యకృష్ణ..తమిళనాడు మాజీ సీఎం జయలలిత పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పడు కంగనా రనౌత్ అగ్ని పరీక్షనే  ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గౌతమ్‌ మీనన్‌ డైరక్షన్‌లో రమ్యకృష్ణ యాక్ట్ చేసిన ‘క్వీన్’‌ వెబ్‌సీరీస్‌కి మంచి రెస్పాన్సే వచ్చింది. జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ వెబ్‌సీరీస్‌ చేశారు. జయలలిత పుట్టి పెరిగిన తీరు, ఆమె రాజకీయాల్లోకి రావడం వంటివన్నీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి. జస్ట్ ఆడియన్స్‌ని మాత్రమే కాదు… సింగపూర్‌ ఏషియన్‌ అకాడమీ క్రియేటివ్‌ అవార్డులను కూడా సొంతం చేసుకుంది క్వీన్‌ వెబ్‌సీరీస్‌. ఈ సీరీస్‌ మొదలుపెట్టిన సేమ్‌ డే అవార్డు అనౌన్స్ కావడం చాలా హ్యాపీగా ఉందన్నారు రమ్యకృష్ణ. త్వరలోనే సెకండ్‌ సీజన్‌ షూటింగ్‌ ఉంటుందని హింట్‌ కూడా ఇచ్చేశారు.

ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. ఆ క్వీన్‌కి ఆదరణ పెరిగే కొద్దీ సెట్స్ మీద ఉన్న ‘తలైవి’ సినిమా టీమ్‌కి టెన్షన్‌ పెరుగుతోందట. క్వీన్‌గా వెబ్‌సీరీస్‌తో రమ్య జనాల ఓటు అందుకున్నారు. మరి ఇప్పటికే పలు సందర్భాల్లో అమ్మ అభిమానుల మనసులను అంతగా అట్రాక్ట్ చేయలేకపోయిన కంగనా రనౌత్‌ పరిస్థితి ఏంటి? ఫొటోలతో, పోస్టర్లతోనూ చేయలేకపోయిన పనిని స్క్రీన్‌ మీద పెర్ఫార్మెన్స్ తో చేయగలుగుతారా? అమ్మ వీరాభిమానుల అంగీకారాన్ని పొందగలుగుతారా? ఇప్పుడు ఇదే కోలీవుడ్‌లో ఇంట్రస్టింగ్‌ డిష్కసన్‌గా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read : ఆ కుటుంబం అధికారంలో ఉంటే..వర్షాలు పుష్కలం..వైఎస్సార్, జగన్‌లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్