ట్రంప్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ వాతావరణమే దీనికి కారణమయ్యింది. చైనా వస్తువులపై 10 శాతం ఉన్న సుంకాలను 25 శాతం వేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మన దేశీయ మార్కెట్లే కాకుండా, ఆసియా మార్కెట్లన్నీ బెంబేలెత్తిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్లు పతనమై 38,600కు పడిపోయింది. నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయి 11,598కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.12%), టీసీఎస్ (1.04%), భారతి ఎయిర్ టెల్ (0.69%), సన్ ఫార్మా (0.09%), ఓఎన్జీసీ (0.06%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-5.30%), టాటా మోటార్స్ (-4.49%), బజాజ్ ఫైనాన్స్ (-2.33%), టాటా స్టీల్ (-2.20%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.13%).