లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న స్టాక్‌ మార్కెట్లు

| Edited By:

Mar 20, 2019 | 10:36 AM

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం 9.38 సమయానికి సెన్సెక్స్‌ 4 పాయింట్ల నష్టంతో 38,358 వద్ద నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,553 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రధానంగా ఐటీ, స్థిరాస్తి రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు ధర ఏకంగా నాలుగుశాతం పతనమైంది. ఇటీవల ఎతిహాద్‌ సంస్థ తన 24శాతం వాటాను విక్రయిస్తామని ప్రకటించడంతో మార్కెట్లో జెట్‌ఎయిర్‌వేస్‌ షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్ విధాన నిర్ణయాలను ప్రకటించనున్న […]

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న స్టాక్‌ మార్కెట్లు
Follow us on

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం 9.38 సమయానికి సెన్సెక్స్‌ 4 పాయింట్ల నష్టంతో 38,358 వద్ద నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,553 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రధానంగా ఐటీ, స్థిరాస్తి రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు ధర ఏకంగా నాలుగుశాతం పతనమైంది. ఇటీవల ఎతిహాద్‌ సంస్థ తన 24శాతం వాటాను విక్రయిస్తామని ప్రకటించడంతో మార్కెట్లో జెట్‌ఎయిర్‌వేస్‌ షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్ విధాన నిర్ణయాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. భారత మార్కెట్లపై కూడా ఫెడ్‌నిర్ణయ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.