Motilal Vora Died : కాంగ్రెస్ సీనియర్ నేత మోతిలాల్ వోరా కన్నుమూత..తీవ్ర విషాదంలో మునిగిన పార్టీ శ్రేణులు

కాంగ్రెస్ సీనియర్ నేత మోతిలాల్ వోరా సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు 93 సంవత్సరాలు. ఆయన రెండు రోజుల క్రితం యూరిన్ ఇన్పెక్షన్‌తో ఆస్పత్రిలో చేరారని..

Motilal Vora Died : కాంగ్రెస్ సీనియర్ నేత మోతిలాల్ వోరా కన్నుమూత..తీవ్ర విషాదంలో మునిగిన పార్టీ శ్రేణులు

Updated on: Dec 21, 2020 | 4:15 PM

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మోతిలాల్ వోరా సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు 93 సంవత్సరాలు. ఆయన రెండు రోజుల క్రితం యూరిన్ ఇన్పెక్షన్‌తో ఎస్కార్ట్ ఆస్పత్రిలో చేరారని..కానీ మరణానికి కారణం ఆ వ్యాధి కాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌లో కోవిడ్ బారిన పడిన వోరా అప్పట్నుంచి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.  ఇక ఈ దిగ్గజ సీనియర్ నేత ఈ ఆదివారమే తన 93 పుట్టినరోజు జరుపుకున్నారు.  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వోరా రెండు టర్మ్స్‌లో సేవలందించారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు రాజ్యసభ సభ్యడిగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరగకముందువరకు ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.