ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం చోటు చేసుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అశేష ప్రేక్షకాధారణ పొందిన నటి శరణ్య తండ్రి, మలయాళ నటుడు ఆంటోని భాస్కర్ రాజ్ (95) గుండెపోటుతో కన్ను మూశారు. చెన్నైలోని విరుగంబక్కమ్‌లోని ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శరణ్య నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నాం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. కాగా ఆంటోని మృతితో శరణ్య ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మలయాళంలో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించారు ఆంటోని. 70కి పైగా చిత్రాలు తెరకెక్కించిన ఆంటోని భాస్కర్ శ్రీలంకలో దర్మకుడిగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు.
Read More:
బ్రేకింగ్: సెప్టెంబర్ 3న ఏపీ కేబినెట్