చిత్తూరు జిల్లాలో మరోసారి పట్టుబడిన ఎర్ర దొంగలు..నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

|

Dec 08, 2020 | 7:21 AM

ఓవైపు ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లను ఏరివేస్తున్నా... మరోవైపు కొత్తగా దొంగలు పుట్టుకొస్తూనే ఉన్నారు. నిన్న కూడా చిత్తూరు జిల్లా పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 168 దుంగలను పట్టుకున్నారు.

చిత్తూరు జిల్లాలో మరోసారి పట్టుబడిన ఎర్ర దొంగలు..నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Follow us on

ఓవైపు ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లను ఏరివేస్తున్నా… మరోవైపు కొత్తగా దొంగలు పుట్టుకొస్తూనే ఉన్నారు. నిన్న కూడా చిత్తూరు జిల్లా పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 168 దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ నాలుగున్నర కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. ఈ దుంగలతోపాటు.. రెండు లారీలు.. ఒక ఇన్నోవాకారు.. పది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 8మంది ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు పోలీసులు. వీరిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అప్పగించనున్నారు. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్, పుత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు జిలలా పోలీసులు.

పట్టుబడ్డ వారిలో తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ వీరు అనేకసార్లు స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డారు. ఇటీవల కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్‌ బాషాను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అతడు ఇచ్చిన ఆధారాలతో వరుస అరెస్టులు చేస్తున్నారు. స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోంచి ఎర్రచందనాన్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారు. ఏయే మార్గాల్లో ఏయే సమయాల్లో వెళ్తారనే సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.

శేషాచలంలో అపారమైన అటవీ సంపద ఉంది. దీనిలో ముఖ్యంగా ఎర్రచందనం చెట్లకు ప్రపంచ మార్కెట్లో ఎంతో వాల్యూ కూడా ఉంది. దీనికి కారణం ఇక్కడ అడవుల్లో ఉండే భూసారం. శేషాచలం అడవుల్లోంచి ఇప్పటికే లక్షల టన్నుల ఎర్రచందనాన్ని చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ దొంగలను అదుపుచేసేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులను ప్రయోగిస్తోంది.