Seerat Kapoor: దర్శకుడితో దిగిన ఫొటోను షేర్ చేసిన అందాల భామ… ఆయనది ఎన్‌సైక్లోపిడియా మెదడంటూ పొగడ్తలు..

Seerat Kapoor Shares Director Photo: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి సీరత్ కపూర్. తనం అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది సౌత్‌లో నటించింది..

Seerat Kapoor: దర్శకుడితో దిగిన ఫొటోను షేర్ చేసిన అందాల భామ... ఆయనది ఎన్‌సైక్లోపిడియా మెదడంటూ పొగడ్తలు..

Updated on: Jan 25, 2021 | 9:12 PM

Seerat Kapoor Shares Director Photo: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి సీరత్ కపూర్. తనం అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది సౌత్‌లో నటించింది కొన్ని సినిమాలే అయినా నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ‘రన్ రజా రన్’తో తొలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీరత్.. ‘రాజు గారి గది2’, ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా.. తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదలైన ‘మా వింత గాధ వినుమా’ సినిమాతో డిజిటల్ స్క్రీన్‌పై కూడా తళుక్కుమంది. ఈ సినిమా ప్రస్తుతం మంచి రెస్పాన్స్‌తో డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇక సీరత్ కపూర్ తాజాగా ‘మారిచ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ధృవ్ లాథ‌ర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నసీరుద్దిన్‌ షా, అనితా, తుషార్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీరత్ కపూర్ ‘మారిచ్’ చిత్ర దర్శకుడితో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేసింది. దర్శకుడు ధృవ్ లాథ‌ర్‌‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘మా థ్రిల్లర్ సినిమా వెనకా ఉన్న ఎన్‌సైక్లోపిడియా మైండ్ ఇతనే. మా చిత్ర దర్శకుడు ధృవ్ లాథ‌ర్‌‌ను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను’ అంటూ క్యాప్షన్ జోడించిందీ బ్యూటీ.

Also Read: FCUK Movie : ఫ్రంట్ లైన్ వారియర్ చేతుల మీదుగా జ‌గ‌ప‌తిబాబు సినిమా ఫస్ట్ సాంగ్..