కరోనా వ్యాక్సిన్: కోవాక్జిన్‌ రెండో దశ హ్యూమన్ ట్రయల్స్‌ షురూ..!

| Edited By:

Aug 13, 2020 | 1:12 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్ని ఈ వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా తలమునకలై ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన కోవిడ్‌–19 టీకా

కరోనా వ్యాక్సిన్: కోవాక్జిన్‌ రెండో దశ హ్యూమన్ ట్రయల్స్‌ షురూ..!
Follow us on

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్ని ఈ వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా తలమునకలై ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన కోవిడ్‌–19 టీకా ‘కోవాక్జిన్‌’రెండోదశ మానవ ప్రయోగాలు నాగ్‌పూర్‌లో బుధవారం మొదలయ్యాయి. కోవాక్జిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు దేశవ్యాప్తంగా మొత్తం 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్‌లోని నిమ్స్, వైజాగ్‌లోని కేజీహెచ్‌ కూడా ఉన్నాయి.

నివేదికల ప్రకారం వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారత్ కూడా గొప్ప పురోగతి సాధిస్తోంది. వలంటీర్ల నమూనాలను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌కు పంపి.. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని నిర్ధారణ జరిగిన తర్వాత వారికి టీకాను ఇస్తున్నారు. నాగ్‌పూర్‌లోని గిల్లూర్కర్‌ ఆస్పత్రిలో బుధవారం రెండో దశ ప్రయోగం ప్రారంభమయ్యింది. టీకా సమర్థత, రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్న తీరు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ పరిశీలిస్తారు. వందల మంది వలంటీర్లపై ఈ ప్రయోగం ఉంటుంది.

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ