రైల్వే రూట్ల ఎలెక్రిఫికేషన్ లో దూసుకుపోతున్న దక్షిణ మధ్య రైల్వే….ఈ ఏడాది ఆరు సెక్షన్లపై ఫోకస్

| Edited By: Phani CH

Jun 09, 2021 | 10:58 AM

గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో 750 ట్రాక్ కిలోమీటర్ల ఎలెక్రిఫికేషన్ ని పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వే ఈ సంవత్సరం 6 ముఖ్య సెక్షన్లపై ఫోకస్ పెట్టింది.

రైల్వే రూట్ల ఎలెక్రిఫికేషన్ లో దూసుకుపోతున్న దక్షిణ మధ్య రైల్వే....ఈ ఏడాది ఆరు సెక్షన్లపై ఫోకస్
Scr Sets Electrification
Follow us on

గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో 750 ట్రాక్ కిలోమీటర్ల ఎలెక్రిఫికేషన్ ని పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వే ఈ సంవత్సరం 6 ముఖ్య సెక్షన్లపై ఫోకస్ పెట్టింది. కోవిద్-19 కారణంగా పరిమితంగా రైళ్లను నడిపిన ఈ శాఖ అవరోధాలు ఉన్నప్పటికీ పెద్ద సమస్యలెవీ లేకుండా ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను సాధ్యమైనంత త్వరగా నడపగలిగింది. జోన్ రైల్ నెట్ వర్క్ లో మొత్తం 6,424 కి.మీ. దూరం ఉండగా 4,014 ట్రాక్ కిలో మీటర్ల దూరాన్ని ఎలెక్ట్రిఫై చేసినట్టు ఈ శాఖ తెలిపింది. ఇందులో ఏపీకి సంబంధించి 2,587 కి.మీ. తెలంగాణకు సంబంధించి 1,119 కి.మీ. కర్ణాటకకు సంబంధించి 192, తమిళనాడుకు సంబంధించి 7, కి.మీ., మహారాష్ట్ర విషయంలో 108 కి.మీ. దూరం ఉంది. ఇక ఈ సంవత్సరం లింగంపేట-జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు 650 కి.మీ., ముదిఖేడ్ నుంచి ఆదిలాబాద్ వరకు 250, వికారాబాద్ నుంచి పర్లి వరకు 200, మన్మాడ్ నుంచి ఆదిలాబాద్ వరకు 400, పూర్ణా నుంచి అకోలా వరకు 250, పర్భని నుంచి పర్లి వరకు 90 కి.మీ. ఎలెక్రిఫికేషన్ చేయాలన్నది లక్ష్యంగా ఉంది. అలాగే ముంబై-చెన్నై రూట్ లోని వాడి-గుంతకల్ సెక్షన్, అమరావతిని రాయలసీమతో కలిపే గుంటూరు-గుంతకల్ సెక్షన్ వంటివి కూడా ఉన్నాయి.

ఆయా సెక్షన్ల ఎలెక్ట్రిఫికేషన్ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత ప్రయోజనకరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మాల్య తెలిపారు. ఇంకా పలు సెక్షన్లను విద్యుదీకరించాల్సి ఉందని ఆయన చెప్పారు. చెన్నై-ముంబై మధ్య చెన్నై-విజయవాడ-హైదరాబాద్,బెంగుళూరు-ఢిల్లీ మధ్య కనెక్టివిటీ రైళ్ల సౌకర్యాన్ని కల్పించగలిగామన్నారు.

 

మరిన్ని  ఇక్కడ చూడండి: Viral News: వామ్మో.! వీడు మనిషా.. దెయ్యమా.. తలను బొంగరంలో 180 డిగ్రీలు తిప్పేశాడు.. గగుర్పొడిచే దృశ్యం..

యాంటీ బాడీల వృద్ధికి మాస్ వ్యాక్సినేషన్ పరిష్కారం…..లక్నో మెడికల్ యూనివర్సిటీ రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడి