ఏపీ పాఠశాలల్లో మరింత తగ్గుతోన్న హాజరు శాతం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నా విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు పెరుగకపోగా, తగ్గుతూ వస్తోంది. ఈ నెల 2వ తేదీన పాఠశాల తెరిచినప్పుడు ఉన్న హాజరు శాతం 11వ తేదీ నాటికి సగానికి తగ్గింది. కరోనా కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. శానిటేషన్, భౌతిక దూరం వంటివాటిపై తల్లిదండ్రులకు అవగాహన […]

ఏపీ పాఠశాలల్లో మరింత తగ్గుతోన్న హాజరు శాతం
Follow us

|

Updated on: Nov 11, 2020 | 2:51 PM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నా విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు పెరుగకపోగా, తగ్గుతూ వస్తోంది. ఈ నెల 2వ తేదీన పాఠశాల తెరిచినప్పుడు ఉన్న హాజరు శాతం 11వ తేదీ నాటికి సగానికి తగ్గింది. కరోనా కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. శానిటేషన్, భౌతిక దూరం వంటివాటిపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నామంటున్నారు.