Fraud Alert: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరిక..

ఎటువంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు.. మీ పిన్, సీవీవీ వంటి ఎవరికీ చెప్పొద్దు.. అనే మెసేజ్ లు మన ఫోన్ లో చూసే ఉంటాం. ఇప్పుడు ఇలాంటి మెసేజ్ లను కూడా నేరగాళ్లు కాపీ చేస్తున్నారు. ఫేక్ మెసేజ్లు చేస్తూ ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఓ కీలకమైన ప్రకటనను చేసింది.

Fraud Alert: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరిక..
Sbi Rewardz
Follow us

|

Updated on: Aug 05, 2024 | 4:29 PM

బ్యాంకుల పేరిట ఫేక్ మెసేజ్ లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. సాధారణంగా బ్యాంకులు తమ ఖాతాదారుల్లో ఇటువంటి స్కామ్ లపై అవగాహన కల్పించేందుకు వినియోగదారులకు కొన్ని మెసేజ్ లు పంపిస్తుంటాయి. ఎటువంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు.. మీ పిన్, సీవీవీ వంటి ఎవరికీ చెప్పొద్దు.. అనే మెసేజ్ లు మన ఫోన్ లో చూసే ఉంటాం. ఇప్పుడు ఇలాంటి మెసేజ్ లను కూడా నేరగాళ్లు కాపీ చేస్తున్నారు. ఫేక్ మెసేజ్లు చేస్తూ ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఓ కీలకమైన ప్రకటనను చేసింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వినియోగదారులను ఈ మోసపూరిత సందేశాలపై అప్రమత్తం చేసింది. రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకోడానికి కస్టమర్లకు ఏపీకే ఫైల్స్ ను పంపుతూ..దానిని ఇన్ స్టాల్ చేసుకోమని చెబుతున్నారని హెచ్చరించింది. ఆ ఏపీకేని ఇన్ స్టాల్ చేస్తే నేరగాళ్లు సులభంగా మీ ఖాతాలను కొల్లగొట్టేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రివార్డు పాయింట్ల పేరుతో..

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లకు చేసిన హెచ్చరిక ప్రకారం.. రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకోడానికి వినియోగదారులకు ఏపీకే ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోమని చెబుతూ ఎస్బీఐ నుంచి వచ్చినట్లుగా ఆ మెసేజ్ ఉంటుంది. అయితే ఆ మెసేజ్ ఫేక్. ఎస్బీఐ ఎప్పుడూ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా లింక్లు లేదా ఏపీకే ఫైళ్లను పంపదు. ఒకవేళ మీరు అలాంటి మెసేజ్ స్వీకరిస్తే.. ఇది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫైళ్లను డౌన్ లోడ్ చేసుకోకూడదు. ఒకవేళ మీకు అలాంటి మెసేజ్ వచ్చి.. దానిని అనుమానిస్తే.. వెంటనే ఎస్బీఐ అధికారిక చానళ్లలో తనిఖీ చేసుకోవాలి. అలాగే మెసేజ్ తో పాటు వ్యక్తిగత సమాచారాన్ని అడిగినా.. అవతలి వారి ప్రామాణికతను ధ్రువీకరించుకోవాలి. వినియోగదారుల అప్రమత్తత, జాగ్రత్తలే మోసపోకుండా కాపాడుతుందని పీఐబీ పేర్కొంది.

సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్ లు ఇలా ఉంటాయ్..

డియర్ వాల్యూ కస్టమర్..

‘మీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డు పాయింట్లు(రూ. 9980.00)నేటితో ఎక్స్ పైర్ అవుతాయి!ఇప్పుడు ఎస్బీఐ రివార్డు యాప్ ద్వారా రిడీమ్ చేసుకోండి. మీ ఖతాలో నగదు డిపాజిట్ చేయడం ద్వారా మీ రివార్డును క్లెయిమ్ చేసుకోండి. మీ రివార్డును క్లెయిమ్ చేసుకొని, ఏపీకే ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోండి.’ ఇలాంటి మెసేజ్ గానీ మీరూ స్వీకరిస్తే.. వెంటనే అప్రమత్తం కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లింక్స్ పై క్లిక్ చేయకూడదు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • మీకు మెసేజ్ పంపిన వారు ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.
  • ఆ మెసేజ్ బ్యాంక్ అధికారిక కమ్యూనికేషన్ల విధానాల నుంచే వచ్చిందా లేదా అన్నది తనిఖీ చేసుకోండి.
  • మెసేజ్ రూపంలో వచ్చిన లింక్స్, లేదా మీకు తెలియని లింక్స్ క్లిక్ చేయడం.. అటాచ్ మెంట్లను డౌన్ లోడ్ చేసుకోవడం వంటివి చేయకండి.
  • మీకు అనుమానిత మెసేజ్ వస్తే.. మీ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ నుంచి కాంటాక్ట్ వివరాలు ఉపయోగించి సంస్థను సంప్రదించండి. లేదా కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేయండి.
  • బ్యాంక్ అధికారిక యాప్ లేదా వెబ్ సైట్ల నుంచి మాత్రమే లావాదేవీలు నిర్వహించండి. మీ ఖాతాను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి.
  • మీ ఖాతా లాగిన్ వివరాలను ఎప్పుడూ వేరే వ్యక్తితో పంచుకోవద్దు. పంచుకోవాల్సి వస్తే జాగ్రత్తలు పాటించండి.. ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా వంటి వాటి ద్వారా అస్సలు షేర్ చేయొద్దు.
  • ఏదైనా అనుమానాస్పద మెసేజ్లు లేదా ఫిషింగ్ లింక్స్ మీకు వస్తే.. వెంటనే బ్యాంక్ నకు తెలియజేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ చారడేసి కళ్ల సోయగాన్ని గుర్తు పట్టారా? చిరంజీవి మూవీలో ఛాన్స్
ఈ చారడేసి కళ్ల సోయగాన్ని గుర్తు పట్టారా? చిరంజీవి మూవీలో ఛాన్స్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
మహేశ్- రాజమౌళి సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో
మహేశ్- రాజమౌళి సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో
స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. దిమ్మతిరిగే ట్విస్ట్
స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. దిమ్మతిరిగే ట్విస్ట్
సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి