ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు

| Edited By:

Apr 09, 2019 | 3:23 PM

సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. అధికార ప్రతినిధులు, పార్టీల ప్రతినిధుల ప్రసంగాలలో మతం, కులం గురించిన ప్రస్తావన వస్తే ఆ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నాయకత్వంలోని బెంచ్ ఏప్రిల్ 15 న ఎన్నికల సంఘం స్పందన కోరింది. షార్జా నుంచి హర్ ప్రీత్ అనే ఎన్నారై ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ అధికార ప్రతినిధులు మతం లేదా కులాన్ని ప్రస్తావించి ప్రసంగాలు […]

ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు
Follow us on

సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. అధికార ప్రతినిధులు, పార్టీల ప్రతినిధుల ప్రసంగాలలో మతం, కులం గురించిన ప్రస్తావన వస్తే ఆ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసింది.

చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నాయకత్వంలోని బెంచ్ ఏప్రిల్ 15 న ఎన్నికల సంఘం స్పందన కోరింది. షార్జా నుంచి హర్ ప్రీత్ అనే ఎన్నారై ఈ పిటిషన్ దాఖలు చేశారు.

పార్టీ అధికార ప్రతినిధులు మతం లేదా కులాన్ని ప్రస్తావించి ప్రసంగాలు చేస్తే, రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించడానికి, ఎన్నికల సంఘం యొక్క సరళతను పరీక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.