వర్చువల్ కోర్టు విచారణకు కొత్త టెక్నాలజీ

కరోనా ప్రభావంతో న్యాయవ్యవస్థలో కొత్త సిస్టమ్ అమలు చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో కేసుల విచారణకు వర్చువల్ హియరింగ్స్‌ బెటర్ అని భావిస్తోంది సుప్రీంకోర్టు.

వర్చువల్ కోర్టు విచారణకు కొత్త టెక్నాలజీ
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 13, 2020 | 1:16 PM

కరోనా ప్రభావంతో న్యాయవ్యవస్థలో కొత్త సిస్టమ్ అమలు చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో కేసుల విచారణకు వర్చువల్ హియరింగ్స్‌ బెటర్ అని భావిస్తోంది సుప్రీంకోర్టు. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవస్థాపించడానికి సుప్రీంకోర్టు టెండర్ బిడ్లను ఆహ్వానించింది. దీంతో కేసుల విచారణను వినే విధానాన్ని మారుస్తుందని భావిస్తున్నారు.

కొత్త వ్యవస్థ కోర్టు విచారణలను నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తున్నామని సుప్రీంకోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఇది కరోనా నియంత్రణలో భాగంగా ఏకకాలంలో భౌతికదూరం పాటించడంతోపాటు వర్చువల్ హియరింగ్‌లను నిర్వహించడానికి బెంచ్‌ను అనుమతిస్తుంది. దీంతో బహిరంగ న్యాయస్థాన విచారణలలో పాల్గొనడానికి దూరప్రాంతాల నుండి ప్రయాణించలేని న్యాయవాదుల సమస్యను కూడా పరిష్కరిస్తుందన్నారు.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులను వినడానికి డిజిటల్ కోర్టులుగా మారవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భౌతిక దూర నిబంధనలకు అనుగుణంగా కోర్టు ప్రాంగణంలో జనం కదలికలను పరిమితం చేయవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం, ఉన్నత న్యాయస్థానంలో వర్చువల్ హియరింగ్స్ విద్యో అనే యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇది వాస్తవానికి సమావేశాలు, సెమినార్ల కోసం ఉద్దేశించబడింది. దీని స్థానంలో కొత్త టెక్నాలజీ తీసుకురావడం మూలంగా కేసు విచారణకు భద్రత కూడా ఉంటుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. న్యాయమూర్తులు వివాదాస్పద సమస్యను చర్చించాలనుకుంటే, స్పీకర్లను స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కొత్త టెక్నాలజీను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపకల్పనకు టెండర్లను అహ్వానించింది సుప్రీంకోర్టు.