Breaking : క‌రోనావైర‌స్ వ్యాధికి ఉచిత వైద్యంపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు…

కోవిడ్-19కు సంబంధించి సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. కరోనాకు ఉచిత వైద్య సాయం కుదరందని స్ప‌ష్టం చేసింది. కరోనా కోసం ఉచిత టెస్టులు, ట్రీట్ మెంట్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. దీనిపై స్పందించిన జస్టీజ్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం… ఎవరికి ఉచితంగా వైద్యం అందించాలన్న అంశం ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు ప‌రిధిలో ఉంటుంద‌ని వెల్ల‌డించింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి లిటిగేషన్లు పెట్టి ప్రచారం చేయకండని సీరియస్ అయిన ధ‌ర్మాస‌నం..త‌మ […]

Breaking : క‌రోనావైర‌స్ వ్యాధికి ఉచిత వైద్యంపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు...
Follow us

|

Updated on: Apr 21, 2020 | 4:00 PM

కోవిడ్-19కు సంబంధించి సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. కరోనాకు ఉచిత వైద్య సాయం కుదరందని స్ప‌ష్టం చేసింది. కరోనా కోసం ఉచిత టెస్టులు, ట్రీట్ మెంట్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. దీనిపై స్పందించిన జస్టీజ్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం… ఎవరికి ఉచితంగా వైద్యం అందించాలన్న అంశం ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు ప‌రిధిలో ఉంటుంద‌ని వెల్ల‌డించింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి లిటిగేషన్లు పెట్టి ప్రచారం చేయకండని సీరియస్ అయిన ధ‌ర్మాస‌నం..త‌మ వ‌ద్ద ఎలాంటి నిధులు లేవని వ్యాఖ్యానించింది. కాగా కరోనాకు ఇప్పటికే పలు స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్స్ ఉచితంగానే ట్రీట్మెంట్ అందిస్తున్నాయి.

ఢిల్లీకి చెందిన లాయ‌ర్ అమిత్ ద్వివేది… కరోనా వైరస్ ప‌రీక్ష‌ల‌తో పాటు.. చికిత్స్ కూడా దేశ ప్రజలందరికీ ఉచితంగా అందించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ వేశారు. కరోనావైరస్ కొనసాగినంత కాలం ట్రీట్మెంట్ ఫ్రీగా చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు వాదనలు విన్న న్యాయస్థానం…ఈ వ్యాఖ్య‌లు చేసింది.