కస్టమర్లకు ఎస్‌బీఐ వార్నింగ్.. వాటి జోలికి వెళ్లొద్దంటూ హెచ్చరిక!

|

Aug 02, 2020 | 8:57 PM

సైబర్ మోసాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తమ ఖాతాదారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది.

కస్టమర్లకు ఎస్‌బీఐ వార్నింగ్.. వాటి జోలికి వెళ్లొద్దంటూ హెచ్చరిక!
Follow us on

SBI Warns Customers: సైబర్ మోసాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. నేరగాళ్లు కొత్త పంధాల్లో అమాయకుల దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తమ ఖాతాదారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. తమ అకౌంట్లను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి అనే అంశంపై ఖాతాదారులను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది.

ఎవరూ కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని తెలిపింది. అంతేకాకుండా ఒక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యేటప్పుడు.. అది సురక్షితమా.? కాదా.? అనేది చూసుకోవాలని చెప్పింది. వెబ్‌సైట్‌ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు యూఆర్ఎల్ https:// నుంచి ప్రారంభమవుతుందో.. లేదో చూసుకోవాలంది. అటు ఫోన్ ద్వారా బ్యాంక్ వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలు గానీ ఎవరైనా అడిగితే చెప్పొద్దని పేర్కొంది.

Also Read: షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం..