కస్టమర్లకు ఎస్‌బీఐ శుభవార్త.. గోల్డ్ లోన్‌పై స్పెషల్ ఆఫర్ ప్రకటించిన బ్యాంకింగ్ దిగ్గజం. తక్కువ వడ్డీకే రుణాలు.

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ వడ్డికే బంగారంపై రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.

కస్టమర్లకు ఎస్‌బీఐ శుభవార్త.. గోల్డ్ లోన్‌పై స్పెషల్ ఆఫర్ ప్రకటించిన బ్యాంకింగ్ దిగ్గజం. తక్కువ వడ్డీకే రుణాలు.

Edited By:

Updated on: Dec 20, 2020 | 2:38 PM

SBI special offer on Gold Loan: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ వడ్డికే బంగారంపై రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. కేవలం 7.5 వడ్డీతోనే గోల్డ్ ఇస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ కాయిన్స్ పెట్టుకొని కూడా రుణాలు ఇవ్వనున్నారు. మొదట్లో రూ.20 లక్షల వరకు మాత్రమే ఉన్న రుణ పరిమితిని తాజాగా రూ.50 లక్షలకు పెంచారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ ఈ లోన్ తీసుకోవడానికి అర్హులని ఎస్‌బీఐ ప్రకటించింది. ఇందు కోసం ఎలాంటి ఇన్‌కమ్ ప్రూఫ్‌లను అందిచాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో అమలు చేస్తోన్న ఈ వడ్డీ రేట్లను త్వరలోనే భారతదేశమంతా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల బంగారు రుణాలు ఇవ్వాలని ఎస్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.300 కోట్లు విలువైన బంగారు రుణాలను అందజేయడం విశేషం.