SBI New Cheque Payment System: మీరు చెక్‌ల ద్వారా చెల్లింపులు ఎక్కువగా చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీ కోసమే.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ చెల్లింపుల విషయంలో సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. ‘పాజిటీవ్ పే సిస్టమ్’ పేరుతో తీసుకురానున్న ఈ కొత్త విధానాన్ని జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు.
ఆర్‌బీఐ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ కొత్త పేమెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఇంతకీ ఈ పాజిటీవ్ పే సిస్టమ్ అంటే ఏంటనేగా మీ సందేహం.. రూ. 50వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంను చెక్ ద్వారా చెల్లింపులు చేసే చెక్కులోని వివరాలను మరోసారి ధృవీరకరించుకోవడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. పెద్ద మొత్తంలో చెక్‌లను అందించే వారి అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, అమౌంట్, చెక్ జారీ చేసిన తేది, చెల్లింపు దారుని పేరులాంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుబకుని, చెక్ చెల్లింపురకు సంబంధించి మోసం, దుర్వినియోగ కేసులను తగ్గించేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గతంలో తెలిపారు.