స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? బ్యాంక్‌లో డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా?.. పోస్టాఫీస్‌లో డబ్బులు దాచుకుంటున్నారా..? అయితే మీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన అలెర్ట్ తీసుకువచ్చాం. మీరందరూ 15జీ, 15హెచ్ ఫామ్స్‌ను బ్యాంక్‌కు వెళ్లి తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది.
కోవిడ్-19 కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ గతంలో 15జీ, 15 హెచ్ ఫారాలు సమర్పించేందుకు గడువును జూన్ 30కి పొడిగించింది. ఇంకో ఒక్క రోజులో మీరు వీటిని అందజేయకపోతే..మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చే ఇంట్రస్ట్ నుంచి టీడీఎస్ కట్ అవుతుంది. దీంతో మీకు చేతికి తక్కువ డబ్బు వస్తుంది. బ్యాంకులు తప్పనిసరిగా టీడీఎస్ కట్ చేసుకుంటాయి. ఒక ఫైనాన్సియల్ ఇయర్ లో ఎఫ్‌డీలపై ఇంట్రస్ట్ నిర్ణీత పరిమితిని దాటితే అప్పుడు బ్యాంక్స్ టీడీఎస్‌ను కట్ చేసుకుంటాయి. ఈ క్రమంలో డిపాజిట్లు ట్యాక్స్ పరిధిలోకి వచ్చేంత ఆదాయం తమకు రాదని తెలియజేస్తూ.. ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్‌లను బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది.
15జీ ఫారంను 60 ఏళ్లలోపు వయసు కలిగిన వారికి వర్తిస్తుంది. అంటే 60 ఏళ్లకు లోపు వయసు కలిగిన వారంతా ఈ ఫారాన్ని బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో అందించాలి. అదే 60 ఏళ్లు దాటిన వారు అయితే ఫామ్ 15 హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. 15జీ, 15హెచ్ ఫామ్స్ వాలిడిటీ సంవత్సరం ఉంటుంది. తర్వాత మళ్లీ కొత్త ఫామ్స్‌ను బ్యాంకులకు లేదా పోస్టాఫీసులకు అందించాలి.
In light of the current situation, the Central Board of Direct Taxes (CBDT), has decided to extend the validity of Form 15G and 15H submitted for Financial Year 2019-20, till 30th June 2020.#SBI #Announcement #CBDT #Depositors pic.twitter.com/cd9x7ciUqU
— State Bank of India (@TheOfficialSBI) April 16, 2020