జర్నలిస్టు ఖషోగి హత్య కేసులో 8 మందికి జైలు శిక్ష ఖరారు

వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక కాలమిస్టు, సౌదీ అరేబియా క్రిటిక్‌ జమాల్‌ ఖషోగి హత్య కేసులో ఎనిమిది మందికి శిక్ష పడింది. రియాద్‌ క్రిమినల్‌ కోర్టు ఏడు నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

జర్నలిస్టు ఖషోగి హత్య కేసులో 8 మందికి జైలు శిక్ష ఖరారు
Follow us
Balu

|

Updated on: Sep 08, 2020 | 11:56 AM

వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక కాలమిస్టు, సౌదీ అరేబియా క్రిటిక్‌ జమాల్‌ ఖషోగి హత్య కేసులో ఎనిమిది మందికి శిక్ష పడింది. రియాద్‌ క్రిమినల్‌ కోర్టు ఏడు నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాజ్య ప్రభుత్వ అల్ అల్ ఎఖబరియా టీవీ సోమవారం వెల్లడించింది. సౌదీ రాకుమారుడు, దేశ పాలనలో కీలక పాత్ర వహిస్తున్న మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌పై వాషింగ్టన్‌ పోస్టులో విమర్శలతో కూడిన వ్యాసపరంపర రాశారు.. ఆ తర్వాత ఖషోగి హత్య జరగడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేగింది..టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో జమాల్ ఖషోగి 2018 అక్టోబర్ 2 న అదృశ్యమయ్యారు. ఆయనను రాయబార కార్యాలయం లోపల హత్య చేసినట్లు టర్కీ అధికారులు తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. ఖషోగి మృతదేహం ఇప్పటికీ కనిపించకుండాపోవడం గమనార్హం. దీంతో సౌదీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.. రాజకుమారుడు సల్మాన్‌ కార్యాలయంలో పని చేసిన ఫోరెన్సిక్‌ నిపుణులు, ఇంటలిజెన్స్‌, భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణ ఎదుర్కొన్నారు.. అయితే ఖషోగి కుటుంబం నిందితులలో క్షమాభిక్ష ప్రసాదించడంతో అయిదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు.. వారికి 20 సంవత్సరాల జైలుశిక్ష, ఒకరికి పది సంవత్సరాల జైలుశిక్ష, ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష విధించినట్లు ఎఖబరియా పేర్కొంది.

అతడి మృతదేహం ఇంతవరకు ఆచూకీ లేకుండా పోయింది. “కేసును శాశ్వతంగా మూసివేస్తున్నాం” అని వాషింగ్టన్ డీసీలోని అరబ్ సెంటర్కు చెందిన ఖలీల్ జహ్షాన్, ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. అయితే హత్య వెనుక సౌదీ రాకుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాత్రపై సందేహాలు మాత్రం మిగిలే ఉన్నాయి. పలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ ఆపరేషన్ గురించి బిన్ సల్మాన్ కు ముందే తెలుసునని పేర్కొన్నాయి.. కాకపోతే ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికీ బిన్ సల్మాన్ అంటూ ఉంటారు.