సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి కరోనా
కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు. రోజు రోజుకి కొత్త కేసులతో దేశం విలవిలలాడుతోంది. ఇటు సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా కరోనా ముప్పితిప్పలు పెడుతోంది
కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు. రోజు రోజుకి కొత్త కేసులతో దేశం విలవిలలాడుతోంది. ఇటు సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా కరోనా ముప్పితిప్పలు పెడుతోంది. అటు ప్రజలతో మమేకమయ్యే ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయనేతలు కొవిడ్ బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారుల సలహా మేరకు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్‌గా సోకినట్లు వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా తనతో కలిసిన సన్నిహితులు, అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.