Satyadev Godse Movie Heroine: ‘గాడ్సే’ హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా..!

|

Jan 10, 2021 | 9:15 PM

Satyadev Godse Movie: వెర్సటైల్ యాక్టర్ స‌త్యదేవ్ త‌న త‌దుప‌రి చిత్రంగా గోపి గ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శకత్వంలో `గాడ్సే` మూవీ చేస్తోన్న విష‌యం తెలిసిందే...

Satyadev Godse Movie Heroine: గాడ్సే హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా..!
Follow us on

Satyadev Godse Movie: వెర్సటైల్ యాక్టర్ స‌త్యదేవ్ త‌న త‌దుప‌రి చిత్రంగా గోపి గ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శకత్వంలో `గాడ్సే` మూవీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ టైటిల్ పోస్టర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సి.కె. స్క్రీన్స్ ప‌తాకంపై ప్రముఖ నిర్మాత సి. క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘బ్లఫ్ మాస్టర్‌` వంటి క్లాసిక్ మూవీ తర్వాత స‌త్యదేవ్‌, గోపిగ‌ణేష్ ప‌ట్టాభి కాంబినేషన్‌లో యాక్షన్ ప్యాక్‌డ్ థ్రిల్లర్‌గా ‘గాడ్సే` రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమా ద్వారా పాపులర్ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇప్పటివ‌ర‌కూ చేయ‌ని భిన్న త‌ర‌హా క్యారెక్టర్‌లో సత్యదేవ్ న‌టిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి కూడా పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉండే పాత్రలో కనిపించబోతోంది.