కరోనా నుంచి కోలుకున్న మంత్రి, కుటుంబ సభ్యులు..

| Edited By:

Jun 17, 2020 | 5:30 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. తెలంగాణాలో ఇప్పటివరకు మొత్తం 5,406 కేసులు నమోదు కాగా

కరోనా నుంచి కోలుకున్న మంత్రి, కుటుంబ సభ్యులు..
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. తెలంగాణాలో ఇప్పటివరకు మొత్తం 5,406 కేసులు నమోదు కాగా.. 191 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రం 3,027 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందున్న యాక్టివ్ కేసుల సంఖ్య 2,188 ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఈ క్రమంలో.. కోవిద్-19 నుంచి కోలుకొని ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పాల్ మహారాజ్, అతని భార్య డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు తెలిపారు. ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి, అతని భార్యకు మే 31న కోవిడ్-19 పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. 17 రోజుల చికిత్స అనంతరం వారు ఎయిమ్స్, రిషికేశ్ నుంచి ఢిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ రావడంతో మే 31 న మంత్రి మహారాజ్, అతని భార్య, వారి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మనవడుతో కలిసి 24 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకొని జూన్ 10న కుటుంబ సభ్యులు డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు.

Also Read: 20 కోట్ల మొక్కలు లక్ష్యంగా.. తెలంగాణకు హరితహారం