హిందూత్వకు పెద్ద పీట వేశారు..: శారదా పీఠాధిపతి స్వరూపానంద

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామీజీలు స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిషాలకు వారి అభినందనలు తెలిపారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు ఇది దోహదపడుతుందని అన్నారు. ఈ నిర్ణయంతో దేశంలోని శక్తి పీఠాలన్నింటినీ సందర్శించే అవకాశం ఇన్నేళ్లకు తీరిందని స్వరూపానంద ఆనందం వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లోని సరస్వతి శక్తి పీఠం పునరుద్దరణకు ఉపయోగపడుతుందని చెప్పారు. అంతేకాదు రామ […]

హిందూత్వకు పెద్ద పీట వేశారు..: శారదా పీఠాధిపతి స్వరూపానంద

Edited By:

Updated on: Aug 05, 2019 | 4:47 PM

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామీజీలు స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిషాలకు వారి అభినందనలు తెలిపారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు ఇది దోహదపడుతుందని అన్నారు. ఈ నిర్ణయంతో దేశంలోని శక్తి పీఠాలన్నింటినీ సందర్శించే అవకాశం ఇన్నేళ్లకు తీరిందని స్వరూపానంద ఆనందం వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లోని సరస్వతి శక్తి పీఠం పునరుద్దరణకు ఉపయోగపడుతుందని చెప్పారు. అంతేకాదు రామ జన్మభూమి, గోరక్షణ విషయాల్లోనూ ఇదే తరహాలో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భారత దేశపు అధికారిక ఆధ్యాత్మిక చిహ్నంగా గోవును ప్రకటించాలని.. ఈ చర్యలు చేపడితే మోదీని అభినవ వివేకానందుడిగా హిందువులంతా కీర్తిస్తారని వారు పేర్కొన్నారు.