Samantha In OTT: ఇటీవల ‘జాను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న ఆమె.. తమిళ హీరో ప్రసన్న సరసన ఓ మూవీలో తొలిసారిగా జత కట్టనుంది. అంతేకాకుండా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సీజన్‌లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక తాజాగా ఆమె తదుపరి ప్రాజెక్ట్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Amrutham Season 2 From March 25
ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌పై త్వరలోనే ప్రసారమయ్యే ఓ రియాలిటీ షోకు హోస్టుగా సమంతా వ్యవహరించనుందని సమాచారం. ఇక ఆ రియాల్టీ షో అచ్చం అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మాదిరిగా ఉంటుందని వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
Also Read: ట్రెండీ ‘ఐస్‌క్రీమ్ దోశ’.. టేస్ట్‌కు జనాలు ఫిదా..