Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

Ice Cream Dosa: ట్రెండీ ‘ఐస్‌క్రీమ్ దోశ’.. టేస్ట్‌కు జనాలు ఫిదా..

భోజన ప్రియులు కొత్తగా ఏ టేస్టీ వంటకం వచ్చినా అక్కడికి వాలిపోతారు. ఆ ఫుడ్‌ను చక్కగా ఆస్వాదిస్తూ ఆరగించడమే కాకుండా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కూడా. ఇప్పుడు అలాంటి కోవలోనే తాజాగా 'ఐస్‌క్రీమ్ దోశ' ఫేమస్ అవుతోంది...
Ice Cream Dosa, Ice Cream Dosa: ట్రెండీ ‘ఐస్‌క్రీమ్ దోశ’.. టేస్ట్‌కు జనాలు ఫిదా..

Ice Cream Dosa: భోజన ప్రియులు కొత్తగా ఏ టేస్టీ వంటకం వచ్చినా అక్కడికి వాలిపోతారు. ఆ ఫుడ్‌ను చక్కగా ఆస్వాదిస్తూ ఆరగించడమే కాకుండా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కూడా. ఇప్పుడు అలాంటి కోవలోనే తాజాగా ‘ఐస్‌క్రీమ్ దోశ’ ఫేమస్ అవుతోంది. బెంగళూరులోని ఓ టిఫిన్ సెంటర్ యజమాని నా స్టైలే సెపరేట్ అంటూ కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. దోశలను, ఇడ్లీలను, వడలను చట్నీ, సాంబార్‌లతో కాకుండా ఐస్‌క్రీమ్‌లతో వచ్చిన కస్టమర్లకు రుచి చూపిస్తూ తన వ్యాపారాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నాడు.

Also Read: Whatsapp Groups Leak In Google Search

దోశకు పైనా, కింద ఐస్‌క్రీమ్ పూత పూయడమే కాకుండా ప్లేట్లలో ఐస్‌క్రీమ్ స్కూప్స్ వడ్డిస్తున్నాడు. కస్టమర్లు అందరూ కూడా దోశను తుంచుకుని తింటూ టేస్ట్ అదిరిపోయిందని కితాబిస్తున్నారు. ఇక అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర దాన్ని ట్యాగ్ చేసి ఆ హోటల్ యజమాని ఐడియాకు ఫిదా అయిపోయారు. ‘భారతీయ వీధి విక్రేతలు ఆవిష్కరిస్తున్న సరికొత్త ఆలోచనలకు ఫిదా అయ్యానని’ పేర్కొన్నారు. అక్కడ ఐస్‌క్రీమ్ దోశలతో పాటుగా ఐస్‌క్రీమ్ ఇడ్లీలు కూడా ప్రసిద్ధి చెందాయి. అయితే కొందరు వీటిని మెచ్చుకోగా.. మరికొందరు దానికి భిన్నంగా స్పందించారు.

Also Read: UP Sonbhadra No Discovery Of Gold Mines

Also Read: నన్ను చంపేయ్ అమ్మా.. 9 ఏళ్ళ చిన్నారి ఆవేదన.. వీడియో వైరల్..

Related Tags