నా మాటలకు చింతిస్తున్నా.. శ్యామ్ పిట్రోడా ఆవేదన!

1984లో జ‌రిగిన సిక్కుల ఊచకోత ఘటన గురించి కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్య‌లు పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై ఆయన స్పందిస్తూ తన వాఖ్యలను పూర్తిగా వక్రీకరించినట్లు మీడియాకు తెలిపారు. తన హిందీ అంతగా బాగుండదని, జరిగిన చెడు ఏదో జరిగిందని (జో హువా వో బురా హువా) చెప్పడం తన ఉద్దేశమైతే, ‘బురా’ (చెడు) అనే పదం అనువాదం తనకు స్ఫురించలేదని చెప్పారు. ఇక ఈ వ్యాఖ్యలపై […]

నా మాటలకు చింతిస్తున్నా.. శ్యామ్ పిట్రోడా ఆవేదన!

Updated on: May 11, 2019 | 11:08 AM

1984లో జ‌రిగిన సిక్కుల ఊచకోత ఘటన గురించి కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్య‌లు పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై ఆయన స్పందిస్తూ తన వాఖ్యలను పూర్తిగా వక్రీకరించినట్లు మీడియాకు తెలిపారు. తన హిందీ అంతగా బాగుండదని, జరిగిన చెడు ఏదో జరిగిందని (జో హువా వో బురా హువా) చెప్పడం తన ఉద్దేశమైతే, ‘బురా’ (చెడు) అనే పదం అనువాదం తనకు స్ఫురించలేదని చెప్పారు.

ఇక ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, పలువురు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు పిట్రోడా వ్యాఖ్య‌లు కాంగ్రెస్ వైఖ‌రిని తెలియ‌జేస్తున్నాయ‌ంటూ మోదీ తీవ్ర విమ‌ర్శ‌లు చేయడంతో… దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పిట్రోడా వ్యాఖ్య‌లకు పార్టీతో సంబంధంలేద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

అటు ఈ వ్యాఖ్యలపై పిట్రోడా స్పందిస్తూ త‌న వ్యాఖ్య‌ల‌ను మీడియాలో త‌ప్పుగా ప్ర‌చారం చేశార‌ని చెప్పారు. త‌న‌కు హిందీ స‌రిగా రాదు అని, జో హువా వో బురా హూవా అని చెప్పాల‌నుకున్నా, కానీ ఆ స‌మ‌యంలో నా నోట బురా అన్న మాట రాలేదు అని పిట్రోడా తెలిపారు. త‌ప్పుగా మాట్లాడినందుకు పిట్రోడా క్ష‌మాప‌ణ‌లు కూడా కోరారు.