ప్రభాస్ ‘ఆది పురుష్’లో బాలీవుడ్ స్టార్ హీరో విలన్.!
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ డైరెక్షన్‌లో “ఆదిపురుష్” అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు.

Prabhas Adi Purush Movie: లాక్ డౌన్ టైంలో డార్లింగ్ ప్రభాస్ వరుసపెట్టి ప్యాన్ ఇండియన్ మూవీలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ డైరెక్షన్‌లో “ఆదిపురుష్” అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు. ఇందులో రాముడి పాత్రలో డార్లింగ్ కనిపించనున్నాడని ఓ టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించనున్నట్టు బీ-టౌన్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఓం రావత్ ముందు సినిమా ‘తానాజీ’లో కూడా సైఫ్ కీలక రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ప్రభాస్-సైఫ్ కాంబో నిజమే అయితే.. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రీకరణ దశలో ఉంది.
