సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన “స‌డ‌క్ 2”

|

Aug 19, 2020 | 3:59 PM

“స‌డ‌క్ 2″పై భగ్గుమంటున్నారు సినిమా ప్రేమికులు. వారు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నారు. అలియా భ‌ట్ చిత్రం “స‌డ‌క్ 2″పై డిస్‌లైక్‌డ్‌ కత్తి దూస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ సరికొత్త రికార్డులును క్రియేట్ చేస్తోంది. “స‌డ‌క్ 2” ట్రైల‌ర్‌ ప్ర‌పంచంలోనే రెండో మోస్ట్ డిస్‌లైక్‌డ్ వీడియోగా రికార్డుల‌కెక్కింది. ఈ ట్రైల‌ర్‌ను ఇప్ప‌టివ‌ర‌కు 61 మిలియన్ల మంది చూడగా.., జ‌స్టిస్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటూ కుండ‌పోత‌గా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 11.65 మిలియ‌న్ల మంది ఈ వీడియోకు […]

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన స‌డ‌క్ 2
Follow us on

“స‌డ‌క్ 2″పై భగ్గుమంటున్నారు సినిమా ప్రేమికులు. వారు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నారు. అలియా భ‌ట్ చిత్రం “స‌డ‌క్ 2″పై డిస్‌లైక్‌డ్‌ కత్తి దూస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ సరికొత్త రికార్డులును క్రియేట్ చేస్తోంది. “స‌డ‌క్ 2” ట్రైల‌ర్‌ ప్ర‌పంచంలోనే రెండో మోస్ట్ డిస్‌లైక్‌డ్ వీడియోగా రికార్డుల‌కెక్కింది. ఈ ట్రైల‌ర్‌ను ఇప్ప‌టివ‌ర‌కు 61 మిలియన్ల మంది చూడగా.., జ‌స్టిస్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటూ కుండ‌పోత‌గా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

11.65 మిలియ‌న్ల మంది ఈ వీడియోకు డిస్‌లైక్ కొట్ట‌డంతో ప్ర‌పంచ రికార్డు కొట్టేసింది “స‌డ‌క్ 2” ట్రైల‌ర్‌. దీంతో అప్ప‌టివ‌ర‌కు అత్య‌ధికంగా డిస్‌లైకులు సాధించిన వీడియోగా రెండో స్థానంలో ఉన్న జ‌స్టిన్ బీబ‌ర్ బేబీ పాట మూడో స్థానానికి పడిపోయింది. బీబ‌ర్ రికార్డు బ‌ద్ధ‌లు కొట్ట‌డానికి సుమారు 10 సంవ‌త్స‌రాలు ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. 18 మిలియ‌న్ల డిస్‌లైకుల‌తో “యూట్యూబ్ రివైండ్ 2018.. ఎవ్రీ వ‌న్ కంట్రోల్స్ రివైండ్” వీడియో అగ్ర స్థానంలో ఉంది. ఆగ‌స్టు 12 స‌డ‌క్ 2 సినిమా ట్రైల‌ర్ విడుద‌ల అవ‌గా ఇప్ప‌టికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే నిలుస్తుండ‌టం విశేషం.