వెనక్కి తగ్గేదే లేదు.. ఉద్యోగాలు తీసే అధికారం కేసీఆర్‌కు లేదు:ఆర్టీసీ జేఏసీ

| Edited By:

Nov 03, 2019 | 1:31 PM

మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. సిబ్బందికి డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో.. ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఆదివారం ఉదయం సమావేశమైన జేఏసీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లోని హైలైట్స్: సమస్యలపై చర్చించకుండా ఏ ఆర్టీసీ ఉద్యోగి విధుల్లో చేరరు. సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్లు పెట్టడం కొత్తకాదు కోర్టులను కూడా సీఎం డిక్టేట్‌ చేస్తున్నారు ఉద్యోగాలను తీసే […]

వెనక్కి తగ్గేదే లేదు.. ఉద్యోగాలు తీసే అధికారం కేసీఆర్‌కు లేదు:ఆర్టీసీ జేఏసీ
Follow us on

మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. సిబ్బందికి డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో.. ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఆదివారం ఉదయం సమావేశమైన జేఏసీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యల్లోని హైలైట్స్:

  • సమస్యలపై చర్చించకుండా ఏ ఆర్టీసీ ఉద్యోగి విధుల్లో చేరరు.
  • సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్లు పెట్టడం కొత్తకాదు
  • కోర్టులను కూడా సీఎం డిక్టేట్‌ చేస్తున్నారు
  • ఉద్యోగాలను తీసే అధికారం సీఎంకు లేదు
  • డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలి
  • చర్చలు జరిపి కార్మికులకు డెడ్‌లైన్లు పెట్టాలి
  • జీహెచ్‌ఎంసీ డబ్బులు ఇస్తుందని సీఎం చట్టం చేశారు
  • ఐదు వేల బస్సులు ప్రైవేట్‌కు ఇస్తే 5 వేల బస్సులే మిగులుతాయి
  • ఐదు వేల బస్సులకు 27వేల మంది కార్మికులే అవసరమవుతారు
  • మిగతా 23 వేల కార్మికులను ఏం చేస్తారు
  • సమస్యలను పరిష్కరిస్తే యూనియన్లను వైండప్‌ చేస్తాం
  • కార్మికులను భయపెట్టే ధోరణిలో సీఎం మాట్లాడారు
  • ఆత్మద్రోహం చేసుకొని విధుల్లో చేరాల్సిన అవసరంలేదు
  • కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు
  • 4న రాజకీయ పార్టీలతో కలసి డిపోల వద్ద ధర్నాలు
  • 5న సడక్‌ బంద్‌లో భాగంగా రహదారుల దిగ్బంధనం
  • 6న డిపోల వద్ద ఆర్టీసీ కార్మిక కుటుంబాల నిరసన
  • 7న ప్రజా సంఘాలతో కలిసి ప్రదర్శనలు
  • 8న చలో ట్యాంక్‌బండ్‌ ముందస్తు సన్నాహక కార్యక్రమాలు
  • 9న చలో ట్యాంక్‌బండ్, సామూహిక నిరసనలు
    కాగా… పరీక్షల దృష్ట్యా.. ఈ నెల 5న చేపట్టిన రహదారుల దిగ్బంధం వాయిదా వేస్తున్నామని తెలిపారు అశ్వత్థామరెడ్డి