APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సర్వీస్.. పోస్టల్‌శాఖ ద్వారా కొరియర్‌.. ఇకపై హోమ్ డెలివరీ!

ఏపీలో కొరియర్, కార్గోల బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో హోమ్ డెలివరీ సర్వీసులపై ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు పార్శిల్లు ఒక బస్టాండ్ నుంచి...

APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సర్వీస్.. పోస్టల్‌శాఖ ద్వారా కొరియర్‌.. ఇకపై హోమ్ డెలివరీ!

Updated on: Jan 02, 2021 | 5:49 PM

APSRTC :  ఏపీలో కొరియర్, కార్గోల బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో హోమ్ డెలివరీ సర్వీసులపై ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు పార్శిల్లు ఒక బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ వరకు మాత్రమే తరలించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పెద్ద బస్టాండ్లలో డెలివరీ కోసం ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీంతో హోమ్ డెలివరీ చేయలని ఏపీఎస్ ఆర్టీసీ డిసైడయ్యింది.

ఇందుకోసం పోస్టల్ డిపార్టమెంట్..వివిధ కొరియర్ కంపెనీలతో పలు దశల్లో చర్చలు జరిపింది. మొదటగా విజయవాడలో ప్రయోగాత్మకంగా హోమ్ డెలివరీకి పోస్టల్ డిపర్ట్‌మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కవర్‌కు సగటున రూ.10 చొప్పున పోస్టల్‌శాఖ అడుగుతుండగా..ధర తగ్గింపు కావాలని ఆర్టీసీ కోరుతుంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. మున్ముందు అన్ని జిల్లాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

కార్గో, పార్శళ్లను మరింత పెంచి ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో ప్రైవేటు సరకు రవాణా, వాటి ఛార్జీలపై అనాలిసిస్ చేశారు. ఉన్నతాధికారులు సర్వే రిపోర్టు తెప్పించుకున్నారు.  ఇప్పుడు ఆయా వ్యాపార కేంద్రాలు, షాపుల వద్ద నుంచి వాటిని బుక్‌ చేసి తీసుకురావడంపై ఫోకస్ పెట్టారు. ఇందుకు ఓ కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. కార్గో ద్వారా 2019లో ఖర్చులు తీసేయగా ఆర్టీసీకి రూ.52 కోట్ల ఆదాయం వచ్చింది. 2020లో కోవిడ్ కారణంగా కొంతకాలం బస్సులు నిలిపేసి సర్వీసులు తగ్గించినా రూ.42 కోట్ల ఆదాయం సమకూరింది.

Also Read :  Leaders Visit To Ramatheertham : రాజకీయ రణరంగమైన రామతీర్థం..నేతల పర్యటనలతో పెరగిన హీట్