ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మన్మోహన్ జీ వైద్య కన్నుమూత.. రేపు నాగ్‌పూర్‌లో అంత్యక్రియలు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంత కర్త, సంస్కృత భాషా పండితుడు మన్మోహన్ జీ వైద్య (97) శనివారం కన్నుమూశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంత కర్త, సంస్కృత భాషా పండితుడు మన్మోహన్ జీ వైద్య (97) శనివారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇటీవల నాగ్‌పూర్‌లోని స్పందన ఆస్పత్రిలో చేరిన వైద్య.. ఇవాళ తుది శ్వాస విడిచినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. నాగ్‌పూర్‌లోని అంబజారీ ఘాట్‌లో ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ నిర్మాణంలో వైద్య విశేష కృషీ చేశారు. దేశవ్యాప్తంగా శాఖ విస్తరణలో వైద్య ఎనలేని సేవలందించారు. తొమ్మిది దశాబ్దాలుగా సంఘ్ సేవక్‌కు ఎంజీ వైద్యకు విడదీయలేని అనుబంధం ఉంది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎంజీ వైద్య మృతి పట్ల నివాళులు అర్పించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌కు వైద్య అందించిన సేవలను కొనియాడారు. బాబూరావ్ వైద్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నా. పరమ్‌పూజ్య గురూజీతో కలిసి వైద్య విశేషమైన కృషి చేశారు. సంఘ్ సైద్ధాంతిక నిర్మాణంలో వైద్య పాత్ర కీలకమైనది. ఆయన చివరి శ్వాస వరకు సంఘ్ ఆశయాల కోసం జీవితాన్ని అంకితం చేశారు. ‘నాగ్‌పూర్ తరుణ్ భారత్’ సంపాదకుడిగా ఆయన జర్నలిజం వృత్తిలో ఉన్నవారికి ఎంతో ఆదర్శంగా నిలిచారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
राष्ट्रीय स्वयंसेवक संघाचे जेष्ठ स्वयंसेवक, जेष्ठ संपादक आणि विचारवंत मा. गो. उपाख्य बाबूराव वैद्य यांना माझी विनम्र श्रद्धांजली. पूज्य गुरुजी यांच्यासह सर्व सरसंघचालकांसोबत काम करण्याचे, त्यांना जवळून अनुभवण्याचे भाग्य बाबुरावांना लाभले होते.
— Nitin Gadkari (@nitin_gadkari) December 19, 2020