కూరగాయల వ్యాపారి స్కూటర్ కి రూ.42,500 పోలీసుల జరిమానా

| Edited By: Pardhasaradhi Peri

Oct 31, 2020 | 4:47 PM

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ఓ వాహనదారుడికి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఏకంగా 42 వేల 500 రూపాయల ఫైన్ విధించారు.

కూరగాయల వ్యాపారి స్కూటర్ కి రూ.42,500 పోలీసుల జరిమానా
Follow us on

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ఓ వాహనదారుడికి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఏకంగా 42 వేల 500 రూపాయల ఫైన్ విధించారు. అదీ కూడా టూవీలర్ స్కూటర్ కి కావడం విశేషం. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై కర్ణాటక పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన సంఘటనలను జాబితాగా రూపొందించి, ఒకేసారి జరిమానా విధిస్తున్నారు. వేసిన ఫైన్లను కట్టేందుకు సమయం కూడా ఇవ్వకుండా వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.

బెంగళూరులోని మడివల ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ అనే కూరగాయల వ్యాపారి. రోజు తన అవసరాల కోసం టూ వీలర్ స్కూటర్ ను వినియోగిస్తున్నాడు. అయితే, అరుణ్ 77సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఆయనకు రూ.42,500 జరిమానా విధించారు. ఎప్పుడెప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినదీ వివరించే బిల్లును చేతిలో పెట్టారు. ట్రాఫిక్ చలాన్ లిస్టును చూసిన అరుణ్ అవాక్కయ్యాడు. రెండు మీటర్ల పొడవున్న రూల్స్ బ్రేక్ లిస్టును చూసి అరుణ్ షాక్ కు గురయ్యాడు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఈ జరిమానా చెల్లించేందుకు తనకు కాస్త సమయం ఇవ్వాలని అరుణ్ కుమార్ కోరితే, ఆయన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంజునాథ్ అనే మరొక కూరగాయల వ్యాపారి కూడా రూ.15,400 జరిమానా చెల్లించవలసి వచ్చింది. ఆయన 70సార్లు హెల్మెట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నూతన ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారీ జరిమానాలు విధిస్తున్న కేసులు చాలా కనిపిస్తున్నాయి. ఇటు వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుండగా, ట్రాఫిక్ పోలీసుల ఖజానా మాత్రం నిండిపోతుంది.