లక్షల జీతం వదులుకుని రైల్వేలో చాప్రాసిగా పనిచేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు బీహార్‌కి చెందిన శ్రావణ్ కుమార్. ధన్ బాద్ రైల్వే డివిజన్‌లో ట్రాక్ మెన్‌గా గ్రూప్ డి ఉద్యోగంలో చేరాడు. ఇతడి బిటెక్, ఎంటెక్ సర్టిఫికేట్లు చూసి రైల్వే అధికారులు ఆశ్చర్యపోయారు. కాగా, తాను రైల్వేలో చేరడానికి ఉద్యోగ భద్రత ముఖ్యమని చెప్పాడు. ప్రస్తుతం ధన్‌బాద్ రైల్వే డివిజన్ పరిధిలోని చంద్రపురాలో అతను ట్రాక్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే పాట్నాకు చెందిన శ్రావణ్ కుమార్ 2010లో ఐఐటీ-బొంబాయిలో ఇంటెగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో చేరి 2015లో పట్టభద్రుడయ్యాడు. అయితే తనకు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇష్టమని.. రాబోయే రోజుల్లో రైల్వే సర్వీసులో పెద్ద ఆఫీసర్ అవుతానని ధీమా వ్యక్తం చేశాడు.