“రాయల్ ఎన్ఫీల్డ్’ ఈ పేరు వింటేనే…బైక్ రైజర్లకు ఏదో తెలియని ఉత్సుకత. టూవీలర్ రారాజుగా వెలుగొందుతున్న రాయల్ ఎన్పీల్డ్ క్లాసిక్ లుక్కుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.అంతేకాదు..ఇందులోని ఫిచర్స్ కూడా బైక్ రైడర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో అత్యధికంగ అమ్ముడవుతున్న ఈ బైక్స్ ఎక్కువగా 350 సిరీస్ బైకులే ఉన్నాయి.
తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో రెండు కొత్త బుల్లెట్ బైక్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అవి బుల్లెట్ ట్రయల్స్ 500, బుల్లెట్ ట్రయల్స్ 350గా వాటికి నామకరణం. బుల్లెట్ ట్రయల్స్500 ధర రూ.2.07 లక్షలుగా, బుల్లెట్ ట్రయల్స్ 350 ధర రూ. 1.62 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌వి.కొత్తగా వచ్చిన ఈ రెండు బైక్స్ సైతం మార్కెట్లో దూసుకుపోతున్నాయి. బుల్లెట్ ట్రయల్స్ 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో ..బైక్ పవర్ 20 హెచ్‌పీగా, టార్క్ 28 ఎన్‌ఎంగా ఉంది.ఇక ట్రయల్స్ 500 బైక్‌లో 499 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ పవర్ 27.5 హెచ్‌పీ, టార్క్ 41.3ఎన్‌ఎంగా ఉంది. కాగా రెండింటలోనూ కామన్‌గా ఐదు గేర్లుఉంటాయి. ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం కూడా రెండింటిలో సమానం.