AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: హార్ధిక్ పాండ్యా ఔట్.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..

హార్దిక్ పాండ్యా ట్రేడ్ అవుతాడనే ప్రచారం మధ్య ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు అన్న చర్చ మొదలైంది. రోహిత్ శర్మ మళ్లీ పగ్గాలు చేపట్టే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అనుభవం, ఐదు ఐపీఎల్ టైటిళ్లు, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా హిట్‌మ్యాన్‌నే బలమైన ఎంపికగా అభిమానులు భావిస్తున్నారు.

IPL 2027: హార్ధిక్ పాండ్యా ఔట్.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
Rohit Sharma Nita Ambani
SN Pasha
|

Updated on: Jul 22, 2026 | 3:27 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేక అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రాబోయే సీజన్‌కు ముందు హార్దిక్‌ను ట్రేడ్ చేసే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీలు హార్దిక్‌ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ పరిస్థితుల్లో ఒకవేళ హార్దిక్ పాండ్యా జట్టును వీడితే ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మళ్లీ ప్రధానంగా వినిపిస్తోంది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ 2026 టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన ఎంఐ లండన్-సన్‌రైజర్స్ లీడ్స్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీతో కలిసి రోహిత్ శర్మ ఓవల్ స్టేడియంలో వీక్షించడం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా రోహిత్ లండన్‌లోనే ఉండి ఈ మ్యాచ్‌కు హాజరుకావడంతో, అతడిని మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన తర్వాత ముంబై ఇండియన్స్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. గత మూడు సీజన్లలో జట్టు ఒకసారి చివరి స్థానంలో, మరోసారి తొమ్మిదో స్థానంలో నిలవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఆశించిన ఫామ్‌లో లేకపోవడం, జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండటం, తిలక్ వర్మ నాయకత్వ అనుభవం పరిమితంగా ఉండటం కూడా జట్టు ముందున్న సవాళ్లుగా కనిపిస్తున్నాయి.

మరోవైపు రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో సెంచరీతో మెరిశాడు. ఐపీఎల్ 2026లో గాయం కారణంగా కేవలం తొమ్మిది మ్యాచ్‌లకే పరిమితమైనప్పటికీ, 157 స్ట్రైక్‌రేట్‌తో 283 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రోహిత్‌కు ఉన్న అనుభవం, విజయవంతమైన నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటే, అతడే మళ్లీ పగ్గాలు చేపట్టే బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నాడు. అయితే హార్దిక్ ట్రేడ్‌, కొత్త కెప్టెన్ ఎంపికపై ముంబై ఇండియన్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us