వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మ‌ర‌ణం

వరంగల్‌ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ దగ్గర ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభవించింది. బుధవారం తెల్ల‌వారుజామున‌ 3 గంటల సమయంలో కారును ఇసుక లారీ బ‌లంగా ఢీకొట్టింది.

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మ‌ర‌ణం

Updated on: Sep 02, 2020 | 7:38 AM

వరంగల్‌ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ దగ్గర ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభవించింది. బుధవారం తెల్ల‌వారుజామున‌ 3 గంటల సమయంలో కారును ఇసుక లారీ బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేస్తూ… లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఇంతలో ఒక్క‌సారిగా భారీ శబ్దం వచ్చింది. డ్రైవర్ తేరుకునేస‌రికే..అంతా అయిపోయింది. కారు నుజ్జునుజ్జైంది. పరకాల ఏసీపీ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను ప‌ర్య‌వేక్షించారు. చనిపోయిన వారు కారులోనే ఇరుక్కుపోయారంటే ప్ర‌మాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మృతదేహాల్ని అతి కష్టం మీద కారు నుంచి బయటకు తీసి… పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

మ‌ర‌ణించిన వారంతా వరంగల్‌ జిల్లాలోని పోచం మైదాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిని మేకల రాకేశ్‌, చందు, రోహిత్‌, పవన్, సాబీర్‌‌గా‌ గుర్తించారు. వరంగల్‌ నుంచి పరకాలకు కారులో వెళ్తుండగా ప్రమాదం జ‌రిగింది. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

 

Also Read : Big News Big Debate: ఓ మై జీఎస్టీ